చేర్యాల పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
చేర్యాల ఫిబ్రవరి 07(ప్రజాజ్యోతి): ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా సిద్ధిపేట సిపి రష్మీ పెరుమాళ్ అదేనుసారము శనివారం చేర్యాల మున్సిపాలిటీ కేంద్రంలో దాదాపు 100 మంది పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏసిపి సదానందం తెలిపారు. 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే సందర్భంలో స్థానిక ఓటర్లలో భద్రత భావం కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.ఈ ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా ఉండాలని కోరారు.ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు కూడా చాలామంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈ ఫ్లాగ్ మార్చ్ దృశ్యాన్ని తమ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించ డంలో పోటీ పడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన చేర్యాల సిఐ బానోతు రమేష్ నాయక్, ఎస్సై వేముల నవీన్ ను ఏసిపి సదానందం అభినందించారు.
