-
అగ్రంపాడు జాతర ఆదాయం రూ.64.48 లక్షలు
అగ్రంపాడు / వరంగల్, ఫిబ్రవరి 03 (ప్రజాజ్యోతి):
ఆత్మకూరు మండలం అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సమర్పించిన హుండీల లెక్కింపు మంగళవారం నిర్వహించారు. జాతర మొత్తం రూ.64 లక్షల 48 వేల ఆదాయం వచ్చినట్లు ఈవో నాగేశ్వర్ రావు తెలిపారు. వరంగల్ రామన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో, పరకాల ఆర్డీఓ నారాయణ ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 64 హుండీలను లెక్కించగా వివిధ మార్గాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. 2024 సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే 3.56 లక్షల ఆదాయం పెరిగినట్టు ఈవో నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో జాతర చైర్మన్ రంగారెడ్డి, ఎండోన్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

