-
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ అంగోతి అరుణ
వర్ధన్నపేట జనవరి 29, ప్రజా జ్యోతి::
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ముఖ్య బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అంగోతి అరుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో అంగోతి అరుణ బీఆర్ఎస్ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంగోతి అరుణ చేరికతో వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
