‘ఇండియన్ న్యూస్ పేపర్ డే’ సందర్భంగా పత్రికా విలేకరులకు ఘన సన్మానం

Warangal Bureau
1 Min Read
  • ‘ఇండియన్ న్యూస్ పేపర్ డే’ సందర్భంగా పత్రికా విలేకరులకు ఘన సన్మానం

దామెర, జనవరి 29 (ప్రజాజ్యోతి):

ఇండియన్ న్యూస్ పేపర్ డే(జాతీయ వార్త పత్రిక దినోత్సవం)ను పురస్కరించుకొని పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న హనుమకొండ జిల్లా దామెర మండల విలేకరులను ఘనంగా సన్మానించారు. దామెర సర్పంచ్ గరిగె కల్పనకృష్ణమూర్తి, ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి నిర్వహించగా, పలువురు ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే పత్రికా రంగం ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నిజాయితీతో, నిర్భయంగా వార్తలు అందిస్తూ ప్రజలకు స్వరం ఇచ్చే విలేకరుల సేవలు అమూల్యమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వివిధ దిన పత్రికల పాత్రికేయులు మన్నెం ఇంద్రారెడ్డి (ఆంధ్రజ్యోతి), వచ్చునురి శ్రవణ్ (ఈనాడు), కరివేద మహేందర్ రెడ్డి (ప్రజాజ్యోతి), పెంట రవి (ఆంధ్రప్రభ), ఏదుళ్ల విజేందర్ రెడ్డి (నవ తెలంగాణ), దామెర సునీల్ ( జన నిర్ణయం )పత్రికలకు చెందిన విలేకరులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఇందులో భాగంగా విలేకరులు మాట్లాడుతూ.. తమపై చూపిన గౌరవానికి ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *