ఉత్తమ ఉద్యోగులకు అవార్డు
ఎల్లారెడ్డి, జనవరి-26(ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఇద్దరు ఉద్యోగులకు జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వాణిజ్య అధ్యాపకులు డాక్టర్ బి. గంగారెడ్డి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న రవీందర్ కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ తెలిపారు. ఈరోజు వారిద్దరూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారులచేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందించారు.
