మోడల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డి, జనవరి- 26 (ప్రజా జ్యోతి )
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనాన్ని ప్రిన్సిపల్ గాంధీ స్వీకరించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రియదర్శిని లక్ష్మణ్ సింగ్ రాజశేఖర్ బలవంతరావు విద్యారమణ తదితరులు పాల్గొన్నారు.
