వెల్దుర్తి ప్రజాజ్యోతి జనవరి 25
ప్రతి పౌరుడు తన ఓటు హక్కును భయభ్రాంతులు లేకుండా, బాధ్యతతో వినియోగించుకోవాలని వెల్దుర్తి తహసీల్దార్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం తహసీల్దార్ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు అసిస్టెంట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ గిరిధర్, ఎన్నికల యాదవ్, ఆర్‌ఐ రవీంద్ర, వివిధ గ్రామ పంచాయతీల అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు
