చిరుత పులి సంచారం కలకలం

Kamareddy
1 Min Read

చిరుత పులి సంచారం కలకలం

నాగిరెడ్డిపేట్, జనవరి24(ప్రజాజ్యోతి);

నాగిరెడ్డిపేట్ మండలంలో ‌ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం11 గంటలకు తాండూర్ గేట్ సమీపంలోని కోళ్ల ఫారం నుంచి ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో దాటుతూ స్థానికులు కనిపించింది. దింతో ధర్మారెడ్డి అటవీలోకి చిరుత వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానికులు నాగిరెడ్డిపేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ అధికారులకు సమాచారాన్ని అందజేశారు . ఇక, చిరుత పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.చిరుత‌ను బంధించాల‌ని స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. రాత్రిపూట ఒంటరిగా పొలాల‌కు వెళ్లొద్ద‌ని అట‌వీశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *