-
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం
జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు
పర్వతగిరి, జనవరి 15 (ప్రజా జ్యోతి):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్ట తండాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తండా సర్పంచ్ బానోత్ విజయలక్ష్మి భాస్కర్ నాయక్‌తో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పోటీల్లో
మొదటి బహుమతి – బానోతు అనూష (రూ.2,000 నగదు + పట్టు చీర),
రెండో బహుమతి – బానోతు అఖిల (రూ.1,500 నగదు + పట్టు చీర),
మూడో బహుమతి – గుగులోతు మమత, ప్రమీల (రూ.1,000 నగదు + పట్టు చీర),
నాలుగో బహుమతి – భూక్య అనూష (రూ.500 నగదు) అందుకున్నారు.
అదనంగా, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ షీల్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వంగాల రవీందర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పల్లెపాటి శాంతిరథన్ రావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యాగ్యా నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
