సూర్యాపేట జిల్లా ప్రతినిధి (ప్రజాజ్యోతి):సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు దారోజు భాగ్యరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సంక్రాంతి పండగను పురస్కరించుకొని భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భోగి వేడుకలను ప్రారంభించారు.అనంతరం భోగిమంటల చుట్టూ తిరుగుతూ వార్డు ప్రజలు, మహిళలు, చిన్నారులు,యువత సందడి చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెడు ఆలోచనలు, పీడలన్ని భోగిమంటల్లో కలిసిపోవాలని అన్నారు.అందరికీ అన్ని శుభాలు జరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ గౌస్, ఎర్ర పృథ్వి రెడ్డి, కమతం శ్రీకాంత్, కమతం ప్రశాంత్, బన్నీ, పురుషోత్తం, సరిత, నవ్య, శ్రీలత,ఉమా, జ్యోతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
