సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 08(ప్రజాజ్యోతి):మునగాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2026 డైరీని ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఆసంఘ వాల్ క్యాలెండర్, టేబుల్ పోస్టర్ ను ముకుందాపురం కాంప్లెక్స్ హెచ్ఎం ఎం.శోభన్ బాబు , నేలమర్రి కాంప్లెక్స్ హెచ్ఎం ఎం.రవికుమార్ ఆవిష్కరించారు.అనంతరం ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లను ఎస్టీయు సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్టీయు మండల అధ్యక్షులు సత్తూరి బిక్షం మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని కోరారు.బకాయిలో ఉన్న ఆరు డీఏలను,పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు ఎర్ర అంజన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.అరుణ్ కుమార్, కంచుగంటి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి జి.సుదర్శన్,శిరీష, శ్రీరామ్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
