హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో పోన్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి వీర హనుమాన్ శోభాయాత్ర కనులు పండగగా జరిగింది.
గ్రామంలో ఇప్పటివరకు గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా సుమారు 15 ఫీట్ల హనుమాన్ విగ్రహంతో వీధుల్లో ర్యాలీ నిర్వహించగా పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
ఇంటింట మహిళలు మంగళ హారతులతో స్వామివారికి ఘనస్వాగతం పలికారు.
ర్యాలీలో భక్తులు కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో అంగరంగ వైభవంగా హోరెత్తించారు.
భక్తి పాటలు పై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభించి, అంగడి బజార్ వద్ద ముగించారు.
మంగళ హారతులు బట్టి స్వామివారికి స్వాగతం పలికిన మాతలందరికీ భగవద్గీతను బహుకరించారు.
కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర… భక్తి పారవశ్యంలో అంజన్న స్వాములు…
Leave a Comment
