శ్రీరామసాగర్ ద్వారా యాసంగి పంటలకు బుధవారం నుంచి నీటి విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రాజెక్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాల్వలు, ఎత్తిపోతల కింద 7,30,768 ఎకరాలకు 51.04 టీఎంసీల సాగునీటిని అందిం చాలని నిర్ణయించారు. బుధవారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు వారబందీ ప్రకారం ఏడు. తడులుగా ( ఏడు తడులు… 51.04 టీఎంసీలు)
. నీటిని అందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 688 క్యూసె క్కుల వరద చేరుతోంది.
