‘ఓటు చోరీ’పై కాంగ్రెస్ పోరు.!

Bharath Goud
1 Min Read

• జిల్లాలో 65 వేల సంతకాల సేకరణ

• డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల సంఘంతో కలిసి ‘ఓటు చోరీ’కి పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ నిరసనను ఉధృతం చేసింది. ఏఐసీసీ అధిష్టానం ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో ఓటు చోరీకి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 65 వేల సంతకాలను సేకరించినట్లు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. సేకరించిన సంతకాలను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి, బుధవారం హైదరాబాద్, గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్‌కు అధికారికంగా అందజేశారు. అనంతరం ఆంజనేయులుగౌడ్ మాట్లాడారు.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటే.. ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైంది, కానీ కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో, ఈ విలువైన ఓటును దొంగ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *