- అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
- కాంగ్రెస్, బిఆర్ఎస్ నుండి బీజేపీ లోకి చేరికలు
దామెర, నవంబర్ 27 (ప్రజాజ్యోతి):
అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ కి దామెర మండలంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పెద్ద మొత్తంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నుండి ముఖ్య కార్యకర్తలు బీజేపీ లో చేరారు. పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు బండారి రాజేష్, బండారి నరేష్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మంద రాజు ( బుచ్చి కొండయ్య) మేడిపల్లి బాబు పసరగొండ గ్రామ బిజెపి నాయకులు కొట్టే రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దామెర మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల రాజకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ మంద రమేష్, మాజీ మండల్ అధ్యక్షులు జంగిలి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శిలు సూర చందర్, గండు ముఖేష్, పరుశరామ్, గోగుల సమ్మి రెడ్డి, బీజేవైఎం నాయకులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

