- మహిళల ఆత్మగౌరవం పెంపొందించేందుకే ఇందిరమ్మ చీరలు
పర్వతగిరి, నవంబర్ 23 (ప్రజాజ్యోతి)::
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప జేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని కల్లెడ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురకోల రమేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు .రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటిని ప్రభుత్వం మహిళల పేరుతోనే మంజూరు చేస్తోందని, మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోశేట్టి రజిత,మెడగాని స్వప్న, పేరాల రజిత, సిసి దేవేంద్ర, వివోఏ, తక్కలపల్లి శ్రీనివాస్, మహేశ్వరి,సూజాత మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాడి రాజేశ్వరరావు,వడ్లకొండ రమేష్, నీలం శ్రీనివాస్,జిల్లా కుమార్,వడ్లకొండ ప్రసాద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

