- మాధవ హాస్పిటల్ లో ఘనంగా ధన్వంతరి జయంతోత్సవాలు
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ సిటీ, నవంబర్ 19(ప్రజాజ్యోతి):
హిందూ వైద్య దేవుడు ధన్వంతరి పుట్టినరోజు సందర్భంగా బుధవారం నగరంలోని శంభునిపేట లో గల మాధవ హాస్పిటల్లో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ధన్వంతరి జన్మదినాన్ని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. మాధవ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆకారపు రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయుర్వేద పరిషత్ వరంగల్ విభాగం అధ్యక్షులు డాక్టర్ రాము, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహేష్ అధ్వర్యంలో ముందుగా ధన్వంతరి చిత్రపటానికి పూజలు నిర్వహించి పూలమాల వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరై వైద్యులందరికీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పంచమ వేదమైన ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీల అధ్యక్షుడు కర్నె రవీందర్, లయన్స్ క్లబ్ బాధ్యులు శేర్ల అనిల్ కుమార్, వైద్యులు డా. సాంబమూర్తి, డా. అనసూయ, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధ, రిటైర్డ్ ఏడి డాక్టర్ సామిరెడ్డి, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ విజయ్, గణేష్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, చల్లమల్ల సత్యనారాయణ, వలపదాసు కృష్ణ, వాసుదేవ్, సదానందం, సంపత్, అనిల్ కుమార్, పొడిశెట్టి ప్రసాద్ మరియు ఉమ్మడి వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు లయన్స్ క్లబ్ సభ్యులు, బిజెపి నాయకులు, వి హెచ్ పి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

