సూర్యాపేట జిల్లా ప్రతినిధి నవంబర్ 16(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి కొంతమంది కలిసి ఒక వ్యవస్థీకృతంగా ఏర్పడి *1000 కట్టు ఫ్లాట్ పట్టు* అంటూ లాటరీ నిర్వహిస్తున్నారని ఇది చట్టపరంగా నేరమని ఎస్పీ తెలిపారు.లాటరీల పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతున్న మోసగాళ్లపై అధికార యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమైంది.ఇటీవల కాలంలో ఆన్‌లైన్,ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ‘లాటరీ గెలిచారు’, ‘బహుమతి పొందాలంటే ముందుగా ఫీజు చెల్లించాలి’ వంటి పద్ధతుల్లో భారీ మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పైన తెలిపిన వివరాల ప్రకారం ఈ రకమైన మోసాల వల్ల అనేక మంది తమ జీవిత సొమ్మును కోల్పోతున్నారు.ప్రజలను మభ్యపెట్టే నకిలీ లాటరీ ప్రకటనలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా కాల్స్‌కు స్పందించవద్దని హెచ్చరించారు.లాటరీ పేరుతో ఎవరి నుంచి అయినా రూపాయిపైనా డబ్బులు అడగడం చట్ట విరుద్ధమని,ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించనున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,నమ్మకద్రోహులకు అవకాశమివ్వకూడదని విజ్ఞప్తి చేశారు.
