ఆలయాల్లో కార్తీక పూర్ణిమ శోభ 
పోటెత్తిన భక్తులు శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు
మిర్యాలగూడ, నవంబర్ 05,( ప్రజాజ్యోతి ): శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా జరిగాయి.కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మిర్యాలగూడ నియోజకవర్గంలోని శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరంతో మారుమోగాయి.వేకువ జాము నుంచే భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి ఆలయాలకు చేరుకొని కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు.స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు,అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ప్రముఖ ఆలయాలైన వాడపల్లి మీనాక్ష అగేస్త్యేశ్వర స్వామిఆలయం,అడవిదేవులపల్లి లోని బౌద్ధమగుళ్లు కార్తీక శోభ సంతరించుకున్నాయి. భక్తులు ఆలయ పరిసరాలలో పెద్ద ఎత్తున దీపారాధనలు చేశారు.
