హుతాత్మ దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం 
రామారెడ్డి నవంబర్ 04 (ప్రజా జ్యోతి)
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వరంలో హుతాత్మా దివాస్ సందర్బంగా రక్త దాన శిబిరం రామారెడ్డి జూనియర్ కళాశాల లొ నిర్వహించడం జరిగింది.అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోఠారి బ్రదర్స్,మరియు ఎందరో ప్రాణాలను బలిదానం ఇచ్చినటు వంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థం గా విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం, ఈ రక్తదాన శిబిరంలో 25 యూనిట్ల రక్తం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లొ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి , జిల్లా కోశాధ్యక్షులు అమ్ముల శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి బొల్లి రాజు , సహకార దర్శి దండబోయిన దరి,జిల్లా సత్సంగ్ ప్రముఖ బొల్గం శ్రీనివాస్ , విశేష సంపర్క్ ప్రమూక్ పాపారావు, కామారెడ్డి జిల్లా మాతృశక్తి ఉప అధ్యక్షురాలు సుప్పని పుష్పలత , కామారెడ్డి జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ కడెం సాయికుమార్, దుర్గా వాహిని కామారెడ్డి జిల్లా సహ సంయోజిక మాట్టే భవాని , రామారెడ్డి ప్రకండ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్యదర్శి కోటూరి విజయ్ కుమార్, సేవ ప్రముఖ్ భూoపల్లి భాస్కర్,గ్రామ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, కార్యదర్శి వడ్ల సంజీవ్, బజరంగ్దళ్ గ్రామ సహసంయోజక్ కడెం నిఖిల్,సురక్ష ప్రముఖ భవానిపేట వేణు, ప్రఖండ మాతృ శక్తి సంయోజక దండబోయిన శిల్ప,మాతృ శక్తి కార్యకర్తలు స్వప్న, రమ్య, రవళి, వడ్ల విశ్వ కళ్యాణ్, బజరంగ్దళ్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
					