- పట్టించుకోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు
- ఏళ్ల తరబడి తిష్ట వేసుకొని కూర్చున్న మండల వ్యవసాయ అధికారి
- ఆరు రోజులు గడిచిన క్షేత్ర పర్యటనలు శూన్యం
పర్వతగిరి, నవంబర్ 03 (ప్రజాజ్యోతి)
రైతులు పై పంజా విసిరిన మొంథా తుఫాన్‌కు తోడు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇటివల కురిసిన వర్షంతో రైతుల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చిందని మాజీ ఎంపిటిసి మాడుగుల రాజు అన్నారు.మండల వ్యాప్తంగా 14800 ఎకరాల వరి పోలాలు నాట్లు వేశారని అందులో 11వేల ఎకరాలకు పైగా తుఫాన్ ధాటికి దెబ్బతిన్నాయని, ఎన్నో వేల ఎకరాలు ఇప్పటికి నీట మునిగే ఉన్నాయని.. వేలాది కుటుంబాల రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడకుండా నేడు రేపు అంటూ ఆరు రోజులు గడిచిన గాని నీట మునిగిన పొలాలను పరిశీలించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల పొలాలను మాత్రమే ఏవో పరిశీలిస్తున్నారని ఎన్నిసార్లు ఫోన్లు చేసిన గాని స్పందించడం లేదని అనఅన్నారు. ఇటివల కోందరు నాయకులు పర్యటించినా బాధితులకు 10వేల భరోసా ఇస్తామనడం విడ్డురమని పంటలకు పెట్టిన కీటబడి కూడా రాదని కనీసం ఎకరానికి 25వేలు ఇచ్చి ఆదుకుంటామన్న ప్రకటన కూడా చేయలేదు. ప్రకృతి ప్రకోపం.. అధికారుల పట్టింపులేనితనం ప్రజలను కోలుకోని విధంగా దెబ్బతీశాయని అన్నారు. ఈ పాపం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం దొరకనిదిగా మిగిలిందని ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర నివేదిక తయారు చేసి పంట నష్టాన్ని అంచనా వేసి వీలైనంత త్వరగా నష్టపరిహారం అందజేయాలని కోరారు.
