చింతలపల్లి గ్రామంలో విషాదం…బాత్రూమ్ గోడ కూలి విద్యార్థి నవధిప్ యాదవ్ మృతి..

Warangal Bureau
1 Min Read
  • చింతలపల్లి గ్రామంలో విషాదం…బాత్రూమ్ గోడ కూలి విద్యార్థి నవధిప్ యాదవ్ మృతి..
  • శోకసంద్రంలో తల్లిదండ్రులు

సంగెం,నవంబర్01(ప్రజాజ్యోతి):

వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామంలోని యాదవవాడలో శనివారం రోజున స్కూల్ కి వెళ్లకుండా ఇంటి వద్దనే ఆటలు ఆడుకుంటూ ఇంటి ప్రక్క గల దారి వెంట దుకాణం కు వెళ్లు క్రమంలో దారి ప్రక్కనే గల పొరుగింటి వారైనా బన్న రమేష్ గారి బాత్రూం గోడ కూలి పిల్లవాని మీద పడడంతో తలలో తీవ్ర రక్తస్రావం కావడం వలన వేల్పుల నవధిప్ యాదవ్ తండ్రి సాంబరాజు(11) హెలో హిం పాఠశాలలో 5వ తరగతి చదివే విద్యార్థి మృతి చెందాడు.దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.వివరాలలోకి వెళితే..బాత్రూమ్ గోడ వర్షాలతో బాగా తడిసిపోయింది.చిన్నారి నవధిప్ యాదవ్ ఆ గోడ ప్రక్కన్న నిల్చున్నాడు.అయితే గోడ ఉన్నఫళంగా కుప్పకూలింది.ఇటుకలు చిన్నారి నవధిప్ పై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే నవధిప్ తండ్రి సాంబరాజు వెంటనే కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు అప్పటికే నవధిప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.నవధిప్ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చింతలపల్లి గ్రామాన్నే కంటతడి పెట్టించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *