- నల్లబెల్లిలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి
నల్లబెల్లి/ అక్టోబర్ 31 (ప్రజాజ్యోతి):
భారత దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్లబెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులార్పించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆమె సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ దూరదృష్టి, కఠిన నాయకత్వం దేశ నిర్మాణంలో చేసిన కృషి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ మార్గంలో నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పెంతల కొమరారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, మాజీ సొసైటీ డైరెక్టర్ చిట్యాల ఉపేందర్ రెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షులు జంగిలి మోహన్, మందాటి శ్రీనివాస రెడ్డి, బండారి రమేష్, ఒళ్ళే పైడి, నాయకులు కోడెం బిక్షపతి, దూలపెల్లి రవీందర్ రావు, మూడు స్వామి, అంగోతు రఘు, మచ్చిక మహేష్, కొనుకటి రమేష్, కొడిపాక పోశలు, శ్రీరాముల కోటి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బోట్ల సారయ్య, గద్దల సురేష్, బత్తిని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
