- నెక్కొండ ప్రజలకు పోలీసుల అత్యవసర హెచ్చరిక: వాగులు, వంతెనల వద్దకు వెళ్లవద్దు
నెక్కొండ – అక్టోబర్ 29 (ప్రజా జ్యోతి)
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా మండలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెక్కొండ పోలీస్ స్టేషన్ తరపున ఎస్సై మహేందర్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల వాగులు, వంతెనలపై నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున వాటి వద్దకు వెళ్లవద్దని, ప్రవాహం ఉన్న చోట దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విద్యుత్ తీగలు, స్తంభాల దగ్గర నీటిలో నడవకుండా, పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, గ్రామాల్లో ఎవరైనా ప్రమాదంలో ఉంటే తక్షణమే డయల్ 100 లేదా పోలీస్ స్టేషన్ నంబర్లు (8712685236, 8712685026) కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.
