రక్తదానం ప్రాణదానంతో సమానం

Kamareddy
1 Min Read

రక్తదానం ప్రాణదానంతో సమానం

* కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా

ఎల్లారెడ్డి, అక్టోబర్, 29(ప్రజా జ్యోతి)

రక్తదానం ప్రాణదానంతో సమానమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీస్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్‌ సిబ్బంది, సీఐ రాజారెడ్డి ఎస్‌ఐలు,ప్రజా ప్రతినిధులు, యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. యువత సన్మార్గంలో పయనించి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. రక్తదానం చేయడం ద్వారా చాలా మందికి జీవదానం లభిస్తుందని, ఇది పునర్జన్మతో సమానమని వారు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం మంచిదన్నారు. అనంతరం మృతి చెందిన పోలీస్‌ అమరవీరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి ఎస్సైలు బొజ్జ మహేష్, భార్గవ్, ఆంజనేయులు, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్,దీపక్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ జనరల్ సెక్రటరీ జోషి శ్రీధర్, మండల చైర్మన్ జనార్దన్ రెడ్డి, తల సేమియా సిబ్బంది రెడ్ క్రాస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *