- మొంథా తుఫాన్ ప్రభావం- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- ఎస్సై వీ. గోవర్ధన్
నల్లబెల్లి /అక్టోబర్ 29 (ప్రజాజ్యోతి):
మొంథా తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి ఎస్సై వడిచర్ల.గోవర్ధన్ బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు మండల ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకరాదని. పాత భవనాలు, గోడలు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు. వాగులు, లోతట్టు ప్రదేశాలలోకి వెళ్లకూడదని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలను రోడ్లపైకి రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించబడినందున ఇంట్లోనే ఉంచాలని సూచించారు.
