మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలోని ‘మీసాల పిల్ల’ అనే పాట లిరికల్ వీడియోను పంచుకున్నారు. ఆ పాట వివరాలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాఉ. ఈ పాటను దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మెలోడీకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు శ్వేతా మోహన్ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. గతంలో చిరంజీవి చిత్రాలలోని ఎన్నో సూపర్ హిట్ గీతాలకు ఉదిత్ నారాయణ్ తన గాత్రాన్ని అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో పాట రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.