మిర్యాలగూడలో పలు హోటల్స్ పై మున్సిపల్ అధికారులు దాడులు..!
మిర్యాలగూడ, సెప్టెంబర్ 20,( ప్రజాజ్యోతి ): మిర్యాలగూడ పట్టణంలో అనుమతులు లేని పలు హోటళ్ళు, రెస్టారెంట్ లపై మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని విధులు కూడా బైపాస్ వద్ద ఉన్న విట్రోస్ మాల్, ఎస్ ఎస్ ఎస్ రెస్టారెంట్, మద్రాస్ కేఫ్, శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్, ఖలీల్ దాబా, కృష్ణపట్నం రెస్టారెంట్, నిర్మాణంలో ఉన్న చిల్ కేఫ్, టీ వనం తదితర షాపులను తనిఖీ చేశారు.
తనిఖీలలో గడ్డకట్టిన, కుళ్ళి పోయిన చికెన్,పాడైపోయిన తినుబండారాలు దర్శనమిచ్చాయి.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని పలు హోటళ్ళ ను అధికారులు సీజ్ చేశారు.పరిశుభ్రత పాటించని హోటళ్ల కు జరిమానా లు విధించారు. మున్సిపాలిటీ అనుమతులు,
లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. నోటీసులు అందజేశారు.నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవంటూ కమిషనర్ జి. శ్రీనివాస్ హెచ్చరించాడు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, టీపీఎస్ అంజయ్య, రెవెన్యూ అధికారి జ్ఞానేశ్వరి, ఆర్ ఐ సాంబయ్య మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.