గణేష్ నిమజ్జనంలో అపశృతి
సాగర్ ఎడమ కాలములో పడి తండ్రి,కుమారుడు గల్లంతు
మిర్యాలగూడ, సెప్టెంబర్ 05,(ప్రజాజ్యోతి): నిమజ్జనానికి వెళ్లిన తండ్రి కొడుకు గల్లంతైన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం ఆగ మోత్కూర్ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య(45) అతని కుమారుడు పున్న శివ సాయి (20) శుక్రవారం మధ్యాహ్నం అగా మోత్కూర్ గ్రామస్తులతో కలసి వినాయకుడి నిమజ్జనానికి వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు.నిమజ్జనం పూర్తి అయిన వెంటనే సాగర్ ఎడమ కాలువలో స్నానం కోసం దిగే ప్రయత్నంలో కాలుజారి తండ్రి సాంబయ్య నీటిలో పడిపోవడంతో అతడిని రక్షించేందుకు కుమారుడు ప్రయత్నించే క్రమంలో నీటి ప్రవాహ ఉదృతి కి ఇద్దరు కొట్టుకుపోయి గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు గల్లంతయిన తండ్రి కొడుకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలుచేపట్టారు.సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజ్ లు పరిస్థితిని సమీక్షించారు.ఫైర్, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.