సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 31వ వార్డు బాలాజీ నగర్ లో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద బుధవారం అనంతల ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని అన్నారు.కుల మతాలకు అతీతంగా నవరాత్రి ఉత్సవాలలో వార్డు ప్రజలు పాల్గొనటం అభినందనీయమని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గణేష్ నిమజ్జనం కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.పండుగలు, ఉత్సవాలు ప్రజల ఐక్యతకు దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు జావిద్ బెగ్, ఉబెద్ బాయ్, సభ్యులు ప్రణయ్, నిరీక్షీణ్, జయంత్, సాదిక్, నందు, శ్యామ్, నాని, చిన్ను, మహేష్,రాజ్ కుమార్, సంతోష్, నిఖిల్,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.