భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
— ప్రజలకు అండగా మాజీ ఎమ్మెల్యే
— జాజాల సురేందర్
రామారెడ్డి ఆగస్టు 27 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన నిమిత్తం పలు వరద, లోతట్టు ప్రాంతాలను, గ్రామాలను, తండాలను, ప్రమాద సూచికల వద్ద పర్యవేక్షించారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు, పునరావస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు కొరకు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది.అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎవరు కూడా అనవసరంగా బయటకు రాకుండా ఉండాలని కార్యకర్తలతో తన సొంత వాహనం నడుపుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు.భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా హుటా హుటిన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నరు.