పర్వతగిరి, ఆగస్టు 25 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన గౌరారపు ప్రభ 108 లో సోమవారం తెల్లవారు జాము రెండు గంటలకు డెలివరీ అయింది. పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 లో వరంగల్ సికేఎం హాస్పిటల్కు తీసుకెళ్తుండగా నక్కలపల్లి శివారులో డెలివరీ అయినట్లు రెండవ కాన్పులో మగ బిడ్డ పుట్టినట్లు ఈఎంటి శ్యాంసుందర్, పైలెట్ రమేష్ తెలిపారు. తల్లి, పుట్టిన బిడ్డ ను సి కేం హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు.
