అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి
సదాశివనగర్ ఆగస్టు 22 (ప్రజాజ్యోతి)
సదాశివనగర్ భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు కుంటరాంరెడ్డి, మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆకుల సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదాశివనగర్ మండలంలోని రైతులకు(రెండులక్షల) ఋణమాఫీ యూనియన్ బ్యాంక్ సదాశివనగర్ లో 6000 మంది రైతులు ఋణం తీసుకున్నరు. కానీ కేవలం 2500 మందికి రైతులకు సుమారు మాఫీ అయింది. ఇంకా 3500 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. పద్మాజీవాడి సొసైటి లో గల రైతులకు రెండులక్షల రుణమాఫీ కొందరికి కాలేదు. కావున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితమైన హామి హామీలు రైతులకు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి సంతకం రైతు ఋణమాఫీ పైనే అని గప్పాలతో గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేక రైతులను నట్టేట మోసం చేస్తూ రాజబోగాలకు పోతూ రైతులను వంచన చేస్తున్నాడు. కావున మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ సదాశివనగర్ శాఖ హెచ్చరిస్తూ, రుణమాఫీ కానీ ప్రతీ రైతుకు రుణమాఫీ చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులు మీకు తగు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు అమృత భూంరావు, చక్రధర్ గౌడ్, హారిక గోపాల్, మోహన్ రాజ్, రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, గంగాధర్, సీనియర్ నాయకులు ఆశన్న, సుదర్శన్ రెడ్డి, రాజమౌళి, శక్తి కేంద్రం ఇంచార్జి సంతోష్, బూత్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, రమేష్ రెడ్డి, గొల్ల రాజు, వంగ రాజు, బీజేవైఎం శ్రీ కాంత్ నాయకులు పాల్గొన్నారు