పనుల జాతర 2025,సన్మానాలు ప్రశంస పత్రాలు అందజేత

— ఉపాధి హామీ పనుల పత్రాలు అందజేత
— మల్టీపర్పస్ ఉద్యోగులకు సన్మానం
— ఉత్తమ ఉపాధి హామీ కూలీలకు సన్మానం
— కాలభైరవ ఆలయానికి నిధులు మంజూరు
— ఎంపీడీవో నాగేశ్వర్
రామారెడ్డి ఆగస్టు 22 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలంలో పనుల జాతర 2025 లో భాగంగా రామారెడ్డి గ్రామంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ పాల్గొనడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో గత సంవత్సరంలో 2024 -25 గాను ఎక్కువ పని చేసిన దివ్యాంగ వేజ్ సీకర్ అయినటువంటి బి స్వామి కి మరియు ఎక్కువ రోజులు పని చేసినటువంటి బిట్ల నారాయణ కి ప్రశంసా పత్రం అందించి సన్మానించడం జరిగింది. మరియు గ్రామంలోని మల్టీ పర్పస్ వర్కర్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఉపాధి హామీ పనుల మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగినది. ఇస్సన్నపల్లి గ్రామంలో కాలభైరవ స్వామి ఆలయం వద్ద ఎస్బిఎం నిధులతో మంజూరు. కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ పనికి మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్ భూమి పూజ చేయడం జరిగింది.అన్ని గ్రామాలలో వివిధ పనులకు మంజూరు పత్రాలు అందజేస్తూ పనులు ప్రారంభించడం జరిగినది. మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్, ఎంపీడీవో కే నాగేశ్వర్, ఎంపీ ఓ ఏ తిరుపతిరెడ్డి, వెటర్నరీ డాక్టర్ డాక్టర్ టి రామచందర్, ఏవో భాను శ్రీ, ఏ పీ ఓ ధర్మారెడ్డి, టి ఏ లు మరియు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, పార్టీలకతీతంగా ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
