గూడెప్పాడ్ పంచాయితీ కార్యదర్శిపై ‘లోకాయుక్త’ లో ఫిర్యాదు..

Warangal Bureau
1 Min Read

ఆత్మకూరు, ప్రజాజ్యోతి::

అవినీతికి పాల్పడిన కార్యదర్శిపై అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ గ్రామస్తులు లోకాయుక్త ను ఆశ్రయించారు. గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని పేర్కొంటూ శుక్రవారం హైదరాబాద్ లోకాయుక్త నందు ఫిర్యాదు చేసారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామ పంచాయితీ కార్యదర్శి క్రాంతి కుమార్ పై గ్రామస్తులు లోకాయుక్త నందు ఫిర్యాదు చేసారు. ప్రజా దానం దుర్వినియోగం చేశాడని పేర్కొంటూ ఉన్నత అధికారులు సైతం పట్టించుకోవటం లేదని పేర్కొంటూ ఫిర్యాదు చేసారు. గూడెప్పాడ్ మాజీ ఎంపిటిసి బీరం రజినికర్ రెడ్డి, బీరం రాజి రెడ్డి (ఐకే), కాంతాల రవీందర్ రెడ్డి తదితరులు లోకాయుక్త ను ఆశ్రయించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శి క్రాంతి కుమార్, ఎంపివో విమల, పరకాల డిఎల్పివో రవిబాబు, డీపీవో లక్ష్మి రమాకాంత్, పంచాయితీ ఆడిట్ అధికారులు వీరందరిపై అనినీతి అభియోగము మోపుతూ లోకాయుక్త లో ఫిర్యాదు చేసారు. సానుకూలంగా స్పందించిన లోకాయుక్త ఆఫీసర్లు అభియోగం మోపబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చినట్టు గూడెప్పాడ్ మాజీ ఎంపిటిసి బీరం రజినికర్ రెడ్డి తెలిపారు.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *