సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినాన్ని విజయవంతం చేద్దాం
* పీఆర్టీయుటీఎస్ మహా ధర్నా పోస్టర్ ను ఆవిష్కరణ
ఎల్లారెడ్డి ఆగస్టు 20 (ప్రజా జ్యోతి)
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని మానవ విద్య వనరుల కేంద్రంలో ఎల్లారెడ్డిశాఖ పీఆర్ టీయూటీఎస్ మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షన్ విద్రోహదినం పేరిట సెప్టెంబర్ 1న టీఆర్ టీయూటీఎస్ ఆధ్వర్యంలో చేపట్టి మహాధర్నకు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల లక్షలాదిమంది ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని గుర్తుచేశారు. మరో రెండు రాష్ట్రాలు ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల విద్యాధికారి రాజులు, మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వినయ్, రాష్ట్ర సహాధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసిరామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు షాకీర్, మహేష్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వడ్డే వెంకటేశ్వరరావు, సముద్రాల వెంకటేశ్వరరావు, శివ నరసింహారావు, సత్యనారాయణ, విఘ్నేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.