ఆర్థిక సహాయం అందజేత
— నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ
రామారెడ్డి ఆగస్టు 12 (ప్రజా జ్యోతి)
అన్నారం గ్రామంలో గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన గడ్డమిది నర్సయ్య కుటుంబానికి మాజీ జడ్పీటీసీ నారెడ్డి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు నారెడ్డి మోహన్ రెడ్డి 3000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అందుబాటులో లేక పోయిన అన్నారం కాంగ్రెస్ నాయకుల ద్వార విషయం తెలుసుకొని పెద్ద మనుసుతో స్పందించి. ఎవ్వరు ఆపదలో ఉన్న వెంటనే స్పందించే మంచి మనుసున్న వ్యక్తి మోహన్ రెడ్డి అని గ్రామ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షులు సల్మాన్, మండల నాయకులు రగోతం రెడ్డి, దయానంద్,చంద్రం, సత్యం, శంకర్, తదితరులు ఉన్నారు.