ఆత్మకూరు / ప్రజాజ్యోతి, జులై 18:
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయ్యింది. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని న్యూ బస్టాండ్ ఏరియాలో పెరుమాండ్ల శ్రీనివాస్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. సుమారుగా నాలుగు లక్షల విలువైన దుస్తులు, పరుపులు, ఫర్నిచర్లు గృహపకరణాలు పూర్తిగా కాలినట్టు బాధితుడు శ్రీనివాస్ తెలిపినారు. వీటి అంచనా సుమారుగా నాలుగు లక్షల రూపాయలు అయి ఉంటుంది అని తెలిపారు. బాధితులు కుటుంబ సభ్యులు అందరూ సాయంత్రం అందాద ఎనిమిది గంటలకు బయట కూర్చుండి ఉండగా లోపల విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.