భూ భారతి, ఇందిరమ్మ ఇల్ల పురోగతిపై సమీక్ష
సబ్ కలెక్టర్ కిరణ్మయి
ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది జులై 05
భూ భారతి, ఇందిరమ్మ ఇల్ల నిర్మాణాల పురోగతిపై సబ్ కలెక్టర్ కిరణ్మయి సమీక్షించారు.పెద్ద కొడప్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు.పెద్ద కొడప్గల్ మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో 499మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటిలో చాలా వరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసిల్దార్ దశరథ్,నాయబ్ తహసీల్దార్ రవికాంత్,ఆర్ఐ అంజయ్య,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.