మా బిజెపి నేతలది.. ఎవడు ముయలేడు…
అనుమతి లేని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం తీరు…
సీజ్ చేసిన స్కూల్ ను తెరిచి నిర్వహిస్తున్న శ్రీ చైతన్య..
అనుమతి లేకున్నా నిర్వహణ…
అనుమతి లేదు చర్యలు తీసుకుంటాం : డిఈఓ
(నిజామాబాద్ బ్యూరో – ప్రజాజ్యోతి )
ఏం.. ఏం ఫోటోలు తీస్తున్నారు. తీసుకో అ స్కూల్ బిల్డింగ్ ఎవరిదో తెలుసా.? అంటూనే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ మా వాళ్ళే, అది గుర్తు ఉంచుకొని ఫోటో తీసుకో అన్నాడు. స్కూల్ నడుస్తుంది, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసుకో అంటూ వ్యాంగ్యంగా మాట్లాడారు. సాక్షాత్తు విద్యశాఖ అధికారులు సీజ్ చేసిన పాఠశాలను నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారు. అసలే అనుమతి లేదు. పైగా సిబిఎస్ఈ సిలబస్ అంటూ కరపత్రాలు వేసి మరి కొనసాగిస్తున్నారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.? అదే శ్రీ చైతన్య స్కూల్…
ఇది అసలు కథ…
అది నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్. ఈ స్కూల్ కు ఎలాంటి అనుమతి లేదు. సాక్షాత్తు నిజామాబాద్ ఎంఈఓ నోటీసులు జారీ చేసి, కొత్త స్కూల్ ను సీజ్ చేసారు. కానీ అ సీజింగ్ ను తొలగించి మరి స్కూల్ ను కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న “ప్రజాజ్యోతి” రిపోర్టర్ వెళ్లగా స్కూల్ కొనసాగుతుంది. అవి ఫోటోలు తీసారు. కానీ అక్కడే ఉన్న తెల్ల బట్టల వ్యక్తి విచిత్రంగా వ్యవరించారు. ఇది బిజెపి లీడర్లకు సంబందించిన భవనం. ఎమ్మెల్యే, ఎంపీ మావాళ్లే. నీకు ఇష్టం వచ్చిన ఫోటోలు, వీడియో లు తీసుకో అంటూ వెళ్లిపోయారు. విచిత్రం ఏమిటంటే సీజ్ చేసిన స్కూల్ ను తెరిచి బహిరంగంగా నడిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్కూల్ నిర్వాహకులు పసుపు బోర్డు ఛైర్మెన్ గంగారెడ్డి, ఎంపీ అరవింద్ పేరును బహిరంగగానే వాడుతూ వ్యాంగ్యంగా మాట్లాడటం చిత్రంగా ఉంది. నిత్యం ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే నేతలు ఏకంగా అనుమతులు లేని స్కూల్ లకు అండగా ఉండటం చర్చనీయంశంగా మారింది. రాజకీయ అండదండలు ఉంటే చాలు ఏ అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు.
అండ ఉంటే అనుమతి లేకున్నా…
జిల్లాలో విద్యాశాఖ అధికారుల పని తీరు విమర్శల పాలవుతుంది. చిన్న చిన్న స్కూళ్లపై తమ ప్రతాపం చూపే విద్యాశాఖ అధికారులు కార్పొరేట్, బడా స్కూళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇందుకు శ్రీ చైతన్య, నిశిత స్కూళ్ళు ముందు వరసలో ఉన్నాయి. సిబిఎస్ఈ సిలబస్ అనుమతి లేదు అయినా ఈ స్కూళ్ల నిర్వహణ మాత్రం ఆగడం లేదు. ఇక బైపాస్ రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ కు కనీసం అనుమతి లేదు. భవనం నిర్మాణంలో ఉంది. కానీ అక్కడ స్కూల్ ను కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగే పసి పిల్లల ఉసురు తీసినట్లు అవుతుంది. ఇదంతా బహిరంగా రహస్యమే అయినా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. విద్యార్ధి సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేస్తే గాని ఆఫీస్ మెట్లు దిగి స్కూళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎందుకంటే రాజకీయ నేతల పేరు చెప్పి ఇష్ట రాజ్యాంగా వ్యవహారిస్తున్నారు. నేతల నుంచి ఫోన్ రాగానే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక నెల నెల మాముళ్లు రావడంతో ఫిర్యాదులు లేకుండా చూడాలని బహిరంగగానే చెపుతున్నారు.
డిఈఓ మాటల్లో…
నగర బైపాస్ రోడ్డులోని అనుమతి లేని శ్రీ చైతన్య స్కూల్ నిర్వహణపై “ప్రజాజ్యోతి” రిపోర్టర్ డిఈఓ ఆశోక్ ను వివరణ కోరగా స్కూల్ కు ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. గతంలోనే శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న స్కూల్ ను ఏంఈఓకు ఆదేశాలు ఇచ్చి ముసివేస్తామని తెలిపారు.