సూర్యాపేట టౌన్ జూలై,04(ప్రజాజ్యోతి):సూర్యాపేట ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా గడ్డం ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మోరపాక రాజు,ప్రధాన కార్యదర్శిగా వట్టికూటి అశోక్ గౌడ్,సహాయ కార్యదర్శిగా తంగేళ్లపల్లి కృష్ణ,కోశాధికారిగా చిత్తలూరి సైదులు,ఆర్గనైజర్ గా గుగులోతు మల్సూర్,సభ్యులుగా తరాల శ్రావణ్,తాడూరి ఉపేందర్ గౌడ్,ధరావత్ రాము,పేరం నరేందర్,పోల నరేష్,ఎస్.కె నజీర్,ఏనుగ విజయ రెడ్డిలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు ఉపేందర్ రెడ్డి,అశోక్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల బేబీ కేర్ హాస్పిటల్ సమీపంలోని రోహిత్ డయాగ్నస్టిక్ సెంటర్ అడ్డా ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.యూనియన్ సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.24 గంటల పాటు అందుబాటులో ఉండే తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు,డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.