నాగారం జూన్ 30 ప్రజా జ్యోతి.ప్రభుత్వ ఉద్యోగి కి పదవి విమరణ తప్పనిసరి అని ఎంఆర్ఓ హరి కిషోర్ శర్మ అన్నారు. తాహసిల్దార్ కార్యాలయం లో ఆర్ ఐ గా విధులు నిర్వహించిన మహమ్మద్ అల్లావుద్దీన్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 ఏళ్ల సర్వీసులో అనేకమందికి సేవలందించి మంచి పేరు సంపాదించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం తహసిల్దార్ జామీరోద్ధిన్ డిప్యూటీ తాసిల్దార్ షాహిని బేగం సీనియర్ అసిస్టెంట్ షఫీ జూనియర్ అసిస్టెంట్లు మహేశ్వరి రేణుక ఆసిఫ్ సతీష్ భూభారతీ ఆపరేటర్ సంజీవరెడ్డి సిబ్బంది రామ నరసయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.