ముగిసిన విజిట్ వీసా కాలం…
30 రోజుల గ్రెస్ పీరియడ్…
సౌదీ అరేబియా :
సౌదీ అరేబియా అధికారులు తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇప్పటికే అ దేశంలో ఉన్న గడువు ముగిసిన విజిట్ వీసా కలిగిన విదేశీయులకు 30 రోజుల గ్రెస్ పీరియడ్ (తేలిక పరస్పర కాలం) ఇవ్వనున్నారు. ఈ 30 రోజుల్లో వారు వీసాను పొడిగించుకోవడానికి అవకాశం కల్పించారు. లేదా తిరిగి దేశం వదిలి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అక్కడి అధికారిక వివరాల ప్రకారం ఈ గ్రెస్ పీరియడ్ వీసా గడువు ముగిసిన నాటి నుండి రోజులను లెక్కిస్తారు. అ తరువాత అదనపు జురిమానా లేకుండా 30 రోజుల లోపు చర్యలు తీసుకుంటారు. విజిట్ వీసా లో ఉన్నవారు పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకుని సంబంధిత ఇమిగ్రేషన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. వీసా పొడిగింపు అవకాశాన్ని ఉపయోగించుకొని శిక్షలు లేకుండా జాగ్రత్త ఉండాలని తెలిపారు.