అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు 30 నుంచి 200 శాతం వరకు పెరిగాయి. గత ఎనిమిదేళ్లలో భూముల ధరలు పెంచడం ఇదే మొదటిసారి. కొత్త రేట్లు ఏడో తేదీ (శనివారం) నుంచే అమలులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

2004 సెప్టెంబర్‌లో భూముల ధరల పెంపు ప్రతిపాదనతో సవరించిన రేట్లను అమల్లోకి తెచ్చినట్లు సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే వెల్లడించారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.

కొత్త ధరల ప్రకారం జిల్లాలోని రాకాబ్ గంజ్, దేవ్ కాళి ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆయన చెప్పారు. అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తుండటం, మౌలిక వసతుల కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,600 నుంచి రూ.27,900 వరకు పెరుగుతాయని తెలిపారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకు ఉండేది.

ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే మూడు కేటగిరీల కింద వివిధ రేట్లలో భూముల ధర పెరుగుదల ఉంటుందని చౌబే పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై రియల్ ఎస్టేట్ వ్యాపారి వివేక్ అగర్వాల్ స్పందిస్తూ భూముల ధరల పెరుగుదలతో స్టాంప్ డ్యూటీ పెరుగుతుందని, అయితే భూముల అధికారిక విలువ పెరుగుదలతో భూ యజమానులకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *