వరంగల్ మున్సిపల్ ఆఫీసులో రాసలీలలు, వైరల్ అవుతున్న వీడియో..
– రెండు రోజుల కింద ఘటన, వైరల్ అవుతున్న వీడియో
వరంగల్, ప్రజాజ్యోతి::
వరంగల్ మున్సిపల్ ఆఫీసులో రాసలీలల వీడియో వైరల్ గా మారింది. రెండు రోజుల కింద ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావటంతో అధికారులు సదరు ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు సిద్దమైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కింద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమయం ముగియడంతో సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. అకౌంట్స్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు మాత్రం అక్కడే ఉండి ఆఫీస్లోనే రాసలీలల్లో మునిగారు. వీరి ఆగడాలు గమనించిన ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో వీడియో తీసాడు. రెండు రోజుల తరువాత ఈ వీడియో బయట పెట్టాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీయడంతో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రాసలీలల్లో మునిగిన వారిలో ఇటీవల సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన ఓ మహిళా ఉద్యోగితో పాటు, ఐనవోలు మండల కేంద్రానికి చెందిన మరో ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి పనులు చేసిన వారిని అధికారులు కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.