పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యం
* బడిబాట కార్యక్రమం
* కార్పొరేట్ విద్యతో సమానం
* ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి మెరుగైన చదువు కోసం
రామారెడ్డి, మే 30 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ పరిధిలో పేరెంట్స్ , టీచర్స్ మీటింగ్ లో భాగంగా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని సూచించడం జరిగింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతంగా విద్యను బోధిస్తున్నాయని అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లలో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందని ఈ యొక్క విషయాన్ని తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం మేలు, డబ్బులు వృధా ఖర్చు చేసుకోకుండా మెరుగైన విద్యను పిల్లలకు అందించడం తల్లిదండ్రుల బాధ్యత, అని తల్లిదండ్రులతో చర్చించారు. అలాగే ముందస్తు బడిబాట లో భాగంగా 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ఒకటవ తరగతిలో చేర్పించాలని పిల్లల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది.కార్యక్రమం లో స్కూల్ టీచర్స్ యాదయ్య, భూపతి శ్రీనివాస్, అబ్దుల్ ఖదీర్, సిఆర్పి మహముద్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.