రిజర్వాయర్ ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు

ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
అనంతరం మీడియా సమావేశం….!
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారు.ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేసాను తక్షణమే 23 కోట్లు మంజూరైతే 14500 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని అధికారులు చెప్పారు.ప్రాజెక్టు పనులపై రెండుసార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించాను
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించాను….!
కాటేవాడి, ధర్మారావుపేట, మోతె రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.గాంధారి మండలంలో 13546 ఎకరాలు, సదాశివనగర్ 24590, రామారెడ్డి 8664, తాడ్వాయి 20220, రాజంపేట 2593, లింగంపేట 22934, ఎల్లారెడ్డి 3200, నాగిరెడ్డిపేట మండలంలో 3100 ఎకరాలకు సాగునీరు అందనుంది.నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది.లక్ష ఎకరాలకు సాగునీరు వస్తే ధనిక రైతుల నియోజకవర్గంగా మారుతుంది.చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇది.. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం పోచారం ప్రాజెక్టు మట్టితో కూడుకుపోయింది.. దీనిపై మంత్రితో మాట్లాడుతున్నాను 5 వేల మంది రైతులతో సీఎంను కలిసి ఫైనాన్స్ అప్రూవల్ తెస్తా 23 కోట్ల రూపాయల విడుదల కోసం 2024 జులై 1 న మంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం అందించాను.. మొత్తం వివరాలు వెల్లడించాను
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాను…!
- ఫలితంగానే 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి
- ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది.
- సాగునీరు
- ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు.