భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో 5000 సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది. దీనిని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు. నయమయ్యారు. ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరు పరీక్షలు నిర్వహించి కోలుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు.
మధుమేహం ఎలా నయమవుతుంది?
మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అర కిలో సుజీ రవ్వ, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని.. ఈ రెండిటిని కలిపి తీసుకెళ్లాలి. ఆలయంలో పూజ చేసిన తర్వాత.. ఈ రవ్వ చెక్కర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. అక్కడ.. చీమలు వచ్చి రవ్వను వేరు చేసి, చక్కెరను మాత్రమే తింటాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు. ఇది కొంచెం వింతగా అనిపించినా.. మీరు నమ్మాల్సిందే. ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు.. ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి.. చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోయాయని చూసి ఆశ్చర్యపోయారు. అంతే కాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని .. షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు అంగీకరించారు. ఈ ఆలయంలోని చీమలను దేవుని చీమలు అని పిలుస్తారు. మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు.