రేపు రామప్ప ఆలయానికి ప్రపంచ దేశాల సుందరీమణులు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీల సందడి నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర ఘన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వీరి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల సుందరీమణులు తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించనున్నారు. బుధవారం వారంతా యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణకు విచ్చేసిన ఈ అందగత్తెలకు సాదర స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రక వైభవాన్ని వారికి పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *