మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఎవరికి ఏ పదవి అంటే…!

V. Sai Krishna Reddy
2 Min Read

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలు కీలక సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అమరావతి జేఏసీకి చెందిన ఆలపాటి సురేశ్‌ను, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా అదే జేఏసీకి చెందిన రాయపాటి శైలజను నియమించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఛైర్మన్‌తో పాటు పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) ఛైర్మన్‌ల నియామకాలను సోమవారం సాయంత్రం పూర్తి చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు నియమితులైన నూతన ఛైర్మన్లు

ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్: పీతల సుజాత (భీమవరం, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS): రవి వేమూరు (తెనాలి, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC): బురుగుపల్లి శేషారావు (నిడదవోలు, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు: డా. జెడ్‌. శివప్రసాద్‌ (నెల్లూరు సిటీ, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC): ఎస్‌. రాజశేఖర్‌ (కుప్పం, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య: ఆకాసపు స్వామి ( తాడేపల్లిగూడెం, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్: సుగుణమ్మ (తిరుపతి, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు: వెంకట శివుడు యాదవ్ (గుంతకల్‌, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు: వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం, టీడీపీ)
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా): దివాకర్ రెడ్డి (తిరుపతి, టీడీపీ)
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈయుడీఏ): వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్: కె.ఎస్.జవహర్ (కొవ్వూరు, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య: పెదిరాజు కొల్లు (నరసాపురం, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్: పేరేపి ఈశ్వర్ (విజయవాడ తూర్పు, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్: మల్లెల ఈశ్వరరావు ( గుంటూరు పశ్చిమ, టీడీపీ)
ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మాలేపాటి సుబ్బానాయుడు (కావలి, టీడీపీ)

మిత్రపక్షాలకు కీలక పదవులు

కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా పలు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్: పసుపులేటి హరి ప్రసాద్ (తిరుపతి, జనసేన)
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC): లీలాకృష్ణ (మండపేట, జనసేన)
ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ: రియాజ్ (ఒంగోలు, జనసేన)
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్: సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం, భాజపా)

ఈ నియామకాల ద్వారా వివిధ సామాజిక వర్గాలకు, పార్టీలకు చెందిన నేతలకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *